CTR: బంగారుపాళ్యం(M)టేకుమండ అటవీ ప్రాంతంలో 14 ఏనుగుల గుంపు మకాం వేసిందని అటవీశాఖ సెక్షన్ అధికారి మురళీమోహన్ శనివారం తెలిపారు. గజరాజుల గుంపు.. పంటలపైకి రాకుండా ఏఫ్ బీవో పద్మావతి, ట్రాకర్లు టేకుమంద, మొగిలివారిపల్లె అటవీ ప్రాంత సరిహద్దులో కాపు కాస్తున్నారని చెప్పారు. బాణసంచా కాల్చి మంటలు వేసి కట్టడి చేస్తున్నామన్నారు.