HNK: ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామ రజక కుల సంఘం పెద్దలు శనివారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ (KUDA) ఇనగాల వెంకటరామరెడ్డిని కలిశారు. గ్రామంలోని శ్రీ మడేలయ్య, సీతాలదేవిల నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలకు రావాలని వారు ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు.