బంగ్లాదేశ్లో భూకంప మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా.. 100 మందికి పైగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. భూకంపంతో పలు భవనాలు కుప్పకూలాయి. వివిధ ప్రాంతాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మంటలు అంటుకుని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.