Director k.vasu: ప్రముఖ దర్శకుడు కే. వాసు (k.vasu) శుక్రవారం ఫిల్మ్ నగర్లో గల తన ఇంటిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కే. వాసు (k.vasu) మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇటీవల సీనియర్ నటుడు శరత్ బాబు కూడా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో దర్శకుడు తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయాడు.
మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కే.వాసునే (k.vasu). ప్రాణం ఖరీదు సినిమాకు కే.వాసు దర్శకత్వం వహించారు. కోతల రాయుడు, తోడు దొంగలు, పల్లెటూరి పెళ్లాం, అమెరికా అల్లుడు, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, అల్లుళ్లొస్తున్నారు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కే.వాసు (k.vasu) తండ్రి ప్రత్యగాత్మ, అతని సోదరుడు హేమాంబరధరరావు ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవారే. ఇద్దరు దర్శకులే.. సో.. అలా కే.వాసు (k.vasu)కూడా మూవీస్ డైరెక్ట్ చేశారు.