MDK: పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.