ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపు వద్ద త్వరలోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం నిర్మించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు. ఇవాళ ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపు వద్ద కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వర రావు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఎకరం స్థలంలో కార్యాలయం నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.