వనపర్తి జిల్లాలో ఇంటర్ చదువుతున్న అజయ్, చంద్రశేఖర్ అనే ఇద్దరు విద్యార్థులు తమకు దొరికిన విలువైన ఐఫోన్‌ను రూరల్ ఎస్సై జలేందర్ రెడ్డికి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్ద రోడ్డుపై వారికి ఐఫోన్ దొరికింది. దానిని వెంటనే స్టేషన్లో అప్పగించడంతో, విద్యార్థుల నిజాయతీని ఎస్సై అభినందించారు.