TG: హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్ విచారణ ముగిసింది. కాసేపట్లో కోర్టు నుంచి ఆయన బయటకు రానున్నారు. దాదాపు అరగంటపాటు జగన్ కోర్టులో ఉన్నారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన నేరుగా లోటస్పాండ్ నివాసానికి వెళ్లనున్నారు. కాగా, అక్రమాస్తుల కేసులో జగన్ ఇవాళ విచారణకు హాజరయ్యారు.