GNTR: తెనాలిలోని అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ జే. ఆర్ అప్పల నాయుడు ఆకస్మికంగా సందర్శించారు. గురువారం ఉదయం హెల్త్ ఆఫీసర్ యేసుబాబుతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్‌ను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.