HYD: బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. భూసేకరణ చట్టం నిబంధనలను పాటించకుండా జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ విక్రమ్ దేవ్ సహా 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.