జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వృద్ధుల ఆరోగ్యం, బ్యాంకుల్లో ప్రత్యేక సౌకర్యాలు, చట్టాలపై అవగాహన అవసరమని కలెక్టర్ చెప్పారు.