బీహార్ రాజకీయాలలో నితీష్ కుమార్ మరో రికార్డును సృష్టించనున్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర సీఎంగా ఏకంగా పదో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకే రాష్ట్రానికి సీఎంగా పదిసార్లు ప్రమాణం చేయడం అనేది ఒక అరుదైన ఘనత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నితీష్.. రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాల రూపంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తీసుకునే నిర్ణయాలు, మార్చే పంథా ఆయన్ను ప్రత్యేకమైన నేతగా నిలబెట్టాయి.