SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రెండు కోట్ల 3 లక్షల 25 వేల 676 రూపాయలు వచ్చాయన్నారు. బంగారం 228 గ్రాములు, వెండి 14 కిలోల 300 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ హోంగార్డు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.