MBNR: అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రేపు విస్తృతంగా ‘లిజన్ టు చిల్డ్రెన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. దీని కోసం మొత్తం 22 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.