VZM: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారు పుస్తెల తాడు దొంగతనం కేసులో నిందితుడు బుడుమూరు మణికంఠ సుబుద్ధిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పూల్‌బాగ్ కాలనీకి చెందిన బుడుమూరు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.