కృష్ణా: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మోపిదేవి పుణ్యక్షేత్రం దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చిన ఆయనకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలు పోసి, ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనను ఘనంగా సత్కరించారు.