అన్నమయ్య: పెద్దతిప్పసముద్రంలోని శ్రీప్రసన్న పార్వతి సమేత విరూపాక్షేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసోత్సవ పూజ కార్యక్రమంలో భాగంగా శివలింగానికి ఏకవార రుద్రాభిషేకం, రుద్ర హోమం, పూర్ణాహుతి వంటి పూజలు చేశారు. వేద పండితులు నక్షత్ర హారతి, సప్త హారతి, మంగళ హారతి ఇచ్చారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.