MBNR: మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో నుంచి సోమశిలకు ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సుజాత సోమవారం తెలిపారు. ఈనెల 20న ఉదయం 6 గంటలకు డిపో నుంచి బస్సు స్టార్ట్ అవుతుందన్నారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి 500 రూపాయల టికెట్ ధరగా నిర్ణయించామన్నారు. ఇందులో సోమశిల, సింగోటం పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుందన్నారు.