కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఇవాళ ఉదయం ఓ బస్సు మధ్యలో ఆగిపోయింది. జమ్మలమడుగు నుంచి మదనపల్లెకు ఓ ఆర్టీసీ అద్దె బస్సు బయలుదేరింది. కడపలోకి రాగానే ఆగిపోయింది. అరగంట పాటు బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో కండిషన్లో ఉన్న బస్సులనే అధికారులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.