NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షమ్మ దేవస్థానంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దేవస్థానం ఆలయ ఆవరణలో మహా రుద్ర హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.