ఎన్టీఆర్: మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏ.ఎం.సీ ఛైర్మన్, పాలకవర్గ సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లక్ష్యాల మేరకు రైతులకు అత్యుత్తమ సేవలు అందించాలని వారికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.