VSP: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, యాజమాన్య తీరుపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామని ఉద్యోగులకు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యులర్‌లోని లక్ష్యాలను మీరు సాధించి చూపిస్తే ఉద్యోగాలు వదిలి వెళ్తామంటూ ఉద్యోగ సంఘాల సవాల్ విసిరాయి. ఉపసంహరించుకోకపోతే సోమవారం ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.