NLG: ఇటీవల కురిసిన వర్షాలకు గుర్రంపోడ్ మండల పరిధిలోని ఆమలూరు నుంచి చేపూరుకు వెళ్లే రొడ్డులో కల్వర్టు పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కల్వర్టుకు మరమ్మతులు చేయించారు. నేటి నుంచి రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది తొలగినట్టేనని ఇరు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.