W.G: కాకినాడలో జరిగిన 37వ ఏపీ అంతర జిల్లాల స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పాలకొల్లు ఎస్సై జీ.జే. ప్రసాద్ కుమారుడు కారుణ్య యశ్వసిన్ రజత పతకంతో మెరిశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తరఫున 8-10 ఏళ్ల ఇన్లైన్ స్పీడ్ స్కేటింగ్ విభాగంలో సత్తాచాటి, డిసెంబర్ 5న విశాఖలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. బాలుడిని, తల్లిదండ్రులను జిల్లా ఎస్పీ నయీమ్ ప్రత్యేకంగా అభినందించారు.