KRNL: సదాపురం గ్రామానికి చెందిన నర్సమ్మ పక్షవాతానికి గురై నడవలేని పరిస్థితిలో ఉండటంతో వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ.. PGRS కార్యక్రమానికి వచ్చారు. అయితే ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో వాహనంలోనే ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న జేసీ నూరుల్ కమర్ స్వయంగా వాహనం వద్దకు వెళ్లి దరఖాస్తును పరిశీలించారు. అర్హత ఉంటే తక్షణ పింఛన్ మంజూరు చేయలన్నారు.