HYD: ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్లను ఏసీబీ అధికారులు రూ.1 లక్ష లంచంతో పాటు పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా, BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇస్తామని చెప్పి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.