టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్(Tripura Tourism Ambassador)గా గంగూలీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. గుంగూలీని కోల్కతాలోని ఆయన నివాసంలో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత్ చౌదరి కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. వారి ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడంతో పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగాని(Tripura Tourism Ambassador)కి గంగూలీ(Sourav Ganguly) అంబాసిడర్ గా ఉండటం గర్వించదగ్గ విషయమని త్రిపుర సీఎం మాణిక్ సాహాManik Saha ) అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గంగూలీ భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. కాగా గంగూలీ వచ్చే నెల ప్రారంభంలో విదేశీ పర్యటకు వెళ్లే అవకాశం ఉంది. పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత జూన్ చివరిలో త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించనున్నారు.