»Match Fixing Allegations West Indies Batter Devon Thomas Suspended
Match fixing: వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్ సస్పెండ్!
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్(Devon Thomas)ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది.
ఈ క్రమంలో అతనిపై ఏడు అభియోగాలు మోపింది.
వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్(Devon Thomas)పై మ్యాచ్ ఫిక్సింగ్పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించిన 33 ఏళ్ల థామస్, పాలకమండలి నిబంధనలను ఉల్లంఘించినట్లు ఏడు అభియోగాలు మోపింది. ఈ క్రమంలో ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
2021 లంక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్లాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. 2022 ఆగస్టులో వెస్టిండీస్ తరఫున చివరిసారిగా ఆడిన థామస్, ICC అవినీతి నిరోధక కోడ్ ప్రకారం ఏడు అభియోగాలు మోపారు. దుబాయ్‌లో యూఏఈతో జరగనున్న వన్డే సిరీస్‌లో కూడా ఇతను చోటు దక్కించుకున్నాడు.
ఫిక్సింగ్ ఆరోపణలతో పాటు 2021లో జరిగిన అబుదాబి T10, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లలో పలు అంశాలను నివేదించడంలో విఫలమైనందుకు పాలకమండలి 33 ఏళ్ల థామస్ పై అభియోగాలు మోపింది.
విచారణ సమయంలో థామస్ అవినీతి నిరోధక అధికారులకు సహకరించలేదని ఐసిసి(ICC) ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక టాప్-ఆర్డర్ బ్యాటర్, అతను వైట్-బాల్ క్రికెట్‌ను కూడా కొనసాగించాడు. థామస్ ఒక టెస్టు, 21 ODIలు, 12 T20 లలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ఇది కూడా చూడండి:IPL 2023: ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్