»Issf Shotgun Shooting 2023 India Shooters Genemath Darshana Record
ISSF shotgun shooting: భారత షూటర్ల రికార్డు..గోల్డ్ జస్ట్ మిస్
షాట్‌గన్ ప్రపంచ కప్(issf shotgun shooting 2023)లో మహిళల స్కీట్ విభాగంలో భారత షూటర్లు మంచి ప్రదర్శన ఇచ్చి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, దర్శన రాథోడ్ కాంస్యం సాధించింది.
కజకిస్తాన్‌లోని అల్మాటీలో నిర్వహించిన ISSF ప్రపంచ కప్ షాట్‌గన్ 2023 షూటింగ్(issf shotgun shooting 2023) టోర్నీలో భారత షూటర్లు అదరగొట్టారు. మహిళల వ్యక్తిగత స్కీట్ ఈవెంట్లో భారత షూటర్లు గనేమత్ సెఖోన్(Ganemat Sekhon), దర్శన రాథోడ్(darshana rathod) రజతం, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. సీనియర్ ISSF ప్రపంచకప్‌లో మహిళల స్కీట్ విభాగంలో భారత్ రెండు వ్యక్తిగత పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాదు మనోళ్లు కొంచెంలో బంగారు పతకం మిస్సాయ్యారు. లేదంటే గోల్డ్ వచ్చేది.
గణేమత్(Ganemat)సెఖోన్ ఆమె చివరి 10 షాట్లలో ఐదింటిని కోల్పోయిన క్రమంలో 50/60 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకుంది. కజకిస్తాన్‌కు చెందిన అస్సేమ్ ఒరిన్బే కూడా 50/60తో షాట్‌ను కొట్టింది. అయితే షూట్-ఆఫ్‌లో 2-1తో గెలిచి బంగారు ఆమె పతకాన్ని కైవసం చేసుకుంది. అదే సమయంలో దర్శన రాథోడ్ తన తొలి ISSF ప్రపంచ కప్ పతకం కాంస్యాన్ని గెలుచుకుంది. ఆమె 39/50 షాట్‌తో గోల్డ్ మెడల్ రౌండ్‌కు చేరుకోలేకపోయింది.
పురుషుల స్కీట్‌లో ఒలింపియన్ మైరాజ్ అహ్మద్ ఖాన్ సహా ముగ్గురు భారతీయుల్లో ఎవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మైరాజ్ అహ్మద్ ఖాన్ 119 పాయింట్స్ చేసి 17వ స్థానంలో నిలవగా, గుర్జోత్ ఖంగురా అదే స్కోరుతో 19వ స్థానంలో నిలిచాడు. అనంతజీత్ సింగ్ నరుకా 118 స్కోరుతో 23వ స్థానంలో నిలిచాడు.
షాట్‌గన్ షూటర్ల కోసం ISSF ప్రపంచ కప్‌లో అల్మాటీలో జరిగే పోటీ చివరి దశ. నవంబర్‌లో దోహాలో జరిగే ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు ముందు చివరి దశ ఇటలీలోని లోనాటోలో జరుగుతుంది.