KRNL: డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో జరిగిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇవాళ పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేశామని తెలిపారు. రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.