NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో రికార్డులను పరిశీలించారు. అలాగే ప్రిన్సిపల్ జయపాల్ రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు దగ్గరకు వస్తున్న సందర్భంగా స్టడీ అవర్స్ నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా చూడాలన్నారు.