MLG: ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ వెంకటాపురం మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ శనివారం తెలిపారు. మండల అధ్యక్షుడిగా కనితి వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులుగా చందర్రావు, సున్నం సీతారామ్, రాజ్ కుమార్ ఎన్నికయ్యారన్నారు. ప్రధాన కార్యదర్శిగా నాగేంద్రబాబు, సహాయ కార్యదర్శులుగా ధనకర్, సున్నం రమేష్ ఎన్నికయ్యారు.