KNR: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఇవాళ ఆమె సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల్లో విటమిన్ గార్డెన్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు తెలిపాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.