జమ్మూకాశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎస్ ఆవరణను ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. FSL ఆధారాల సేకరణలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. పేలుడు ధాటికి మృతదేహాలు 300 మీటర్ల దూరంలో ఎగిరిపడినట్లు గుర్తించింది. 150 అడుగుల ఎత్తువరకు మంటలు ఎగిసిపడ్డాయని, 15 కి.మీ. వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపింది.