ADB: భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్ తండ్రి సుబేదార్ రాంజీ మాలోజి సక్పాల్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ సభ్యులు అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ అశోక బుద్ధ విహారులో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో రత్నజాడే ప్రజ్ఞ, దయానంద్, సోమన్న ఉన్నారు.