GNTR: జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇంకా పంపిణీ కాకుండా 49,209 కార్డులు మిగిలి ఉన్నాయని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ తెలిపారు. లబ్ధిదారులు ఈ నెలాఖరులోపు సచివాలయాలు లేదా రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి తమ కార్డులను తప్పకుండా పొందాలని ఆమె కోరారు. ఇప్పటికే 5,36,406 కార్డులు పంపిణీ పూర్తయ్యాయన్నారు.