HYD: సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు ప్రతిపాదించిన రెండు ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన భూ సమస్య పరిష్కారమైంది. రక్షణ శాఖ పరిధి పలు భూములను హెచ్ఎండిఏకు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఆయా మండలాల్లో సమాన విలువగల భూములను రక్షణ శాఖకు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. అప్పగించనున్న భూముల విలువ సుమారు రూ.1018 కోట్లుగా అధికారులన్నారు.