ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ పట్టుబడ్డ 511 కిలోల ఎండుగంజాయిని శుక్రవారం సాయంత్రం అమ్మవారి పేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వేస్ వద్ద దహనం చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజనరావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.స్వాధీనం చేసుకున్న గంజాయి మార్కెట్ విలువ సుమారు ₹2.55 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు.