ప్రకాశం: చీమకుర్తిలో సబ్ స్టేషన్ మరమ్మతుల కోసం శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈ మోహన్ రావు తెలిపారు. చీమకుర్తి టౌన్, గోనుగుంట, కేవీపాలెం, ఇవిపాలెం, పిడతలపూడి, రామచంద్రాపురం, మువ్వవారిపాలెం, మర్రిపాలెం, జీవీఎల్ పురం, గుడిపూడివారిపాలెం గ్రామాలకు కరెంట్ ఉండదన్నారు.