TG: తుమ్మిడికుంట పునరుద్ధరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రజారోగ్యం కోసం జీవ వ్యర్థాలను తొలగిస్తున్నామని తెలిపారు. అయితే, 50-100 గజాల నిర్మాణాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని, పెద్ద నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని కోర్టు నిలదీసింది. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని హైడ్రా తరఫు న్యాయవాది బదులిచ్చారు. విచారణను కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది.