»Govt Of India New Decision Lab Tests Mandatory For Cough Syrup Export
Cough Syrupపై కేంద్రం సీరియస్.. ఇకపై అలా చేయకుంటే కఠిన చర్యలు
భారత్ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందు సేవించి పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్ లో తయారైన కలుషిత దగ్గు మందు తాగడంతో పదుల సంఖ్యలో చిన్నారులు మరణించారు.
దగ్గు నివారణ మందు (Cough Syrup) సేవించి పెద్ద ఎత్తున చిన్నారులతో పాటు పెద్దలు మరణిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న ఈ మరణాలపై (Deaths) ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ మందులు ఎగుమతిదారు (Exports) అయిన భారత్ పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. దగ్గు మందుల ఎగుమతులపై కొత్త నిబంధనలు (New Rules) తీసుకువచ్చింది. ఇకపై దగ్గు సిరప్ లకు ప్రభుత్వ ల్యాబ్ (Govt Lab) అనుమతి తప్పనిసరి చేసింది. అనుమతుల అనంతరమే ఎగుమతులు చేసుకోవాలని కేంద్ర స్పష్టం చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
గతేడాది 2022లో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందు సేవించి పదుల సంఖ్యలో చిన్నారులు (Children) ప్రాణాలు కోల్పోయారు. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్ లో తయారైన కలుషిత దగ్గు మందు తాగడంతో పదుల సంఖ్యలో చిన్నారులు మరణించారు. దీనిపై డబ్లూహెచ్ఓ (WHO) హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
‘దగ్గు మందు ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ల్యాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ పత్రం సమర్పిస్తేనే దగ్గు మందులను ఎగుమతి చేసుకునే అనుమతులు వస్తాయి. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనను తప్పనిసరి’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (Directorate General of Foreign Trade- DGFT) ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఆరు ల్యాబోరేటరీలు (Laboratory) ఉన్నాయి. అవి: 1. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ (చండీఘర్, గువాహటి), సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ (సీడీఎల్- కోలకత్తా), సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ (సీడీటీఎల్- చెన్నె, హైదరాబాద్, ముంబై). వీటితో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్ ల్లో దగ్గు మందు తనిఖీలు చేయించుకోవాలని దగ్గు మందు ఉత్పత్పి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.