TG: సీఎం రేవంత్ రెడ్డితో వివిధ అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. నర్మెట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి CMను మంత్రి ఆహ్వానించారు. కొహెడ మార్కెట్ పనులు చేపట్టడంతో పాటు వేరుశనగ, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వెలుగుమట్ల పేదలకు ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలకు రేవంత్ సానుకూలంగా స్పందించారు.