టీమిండియా-A, సౌతాఫ్రికా-A మధ్య ఇవాళ తొలి అనధికార వన్డే మ్యాచ్ జరగనుంది. 3 మ్యాచుల ఈ అనధికార వన్డే సిరీస్‌లో భారత్‌ను తిలక్ వర్మ నడిపించనున్నాడు. అటు రేపటి నుంచి సౌతాఫ్రికా జట్టుతో జరిగే తొలి టెస్టుకు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ్టి మ్యాచులో ఆడతాడు. మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.