KMM: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, పేదోడికి భద్రత, భరోసా కల్పిస్తున్న ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం పొంగులేటి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి కామాంచికల్ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.