ప్రకాశం: కంభంలోని స్థానిక శ్రీనివాస ఎయిడెడ్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలను ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూల్యాంకన పుస్తకాల్లోని జవాబులు, రాత నైపుణ్యాలను పరిశీలించి విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల ద్వారా విద్యార్థి నైపుణ్యాలను అంచనా వేసి గ్రేడ్స్ నమోదు చేయాలని అధికారులకు చెప్పారు.