కోనసీమ: కూటమి అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని, దీనితో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అండ లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులందరికీ పారదర్శకంగా చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు.