»Bank Officials Issued Notice To Foreclosure A Home
Director Teja: ఇల్లు జప్తు చేశారు.. ఆ నోటీసు ఇప్పటికీ అలానే ఉంచాను: దర్శకుడు తేజ
ఇంటిపై తీసుకున్న లోన్ కట్టకపోవడంతో జప్తు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. లోన్ మొత్తం కట్టినప్పటికీ.. నోటీసు ఇప్పటికీ తీయలేదని గుర్తుచేశారు.
Bank Officials Issued Notice To foreclosure A Home
Director Teja: సినీ ఇండస్ట్రీలోని వారి జీవితాలు మారుతుంటాయి. హిట్ వస్తే.. రాయల్ లైఫ్, అదే సినిమా బొర్లపడితే ఇక అంతే సంగతులు. ప్రముఖ దర్శకుడు తేజ (Director Teja) కూడా జీవితంలో ఎత్తు పళ్లాలను చూశారు. కింది స్థాయి నుంచి వచ్చిన ఆయన.. కొత్త మూవీ అహింస త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారు.
మంచి కథతో వస్తే ప్రేక్షకులు అదరిస్తారని తేజ (Teja) చెబుతున్నారు. కంటెంట్‌కు అనుగుణంగా మూవీ తెరకెక్కించాలని.. హంగులకు పోవద్దని చెబుతున్నారు. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు. తప్పుల నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని వివరించారు.
చిత్రం మూవీతో దర్శకుడు తేజ (Teja) కెరీర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత నువ్వు నేను, జయం సూపర్ హిట్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత నేనే రాజు.. నేనే మంత్రి మూవీ ఆడింది. 2019లో సీత సినిమా తీయగా.. ఈ ఏడాది అహింసతో ముందుకు వస్తున్నారు తేజ (Teja).
గతంలో ఇంటిపై లోన్ తీసుకున్నానని తేజ (Teja) వివరించారు. నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. బ్యాంక్ వాళ్లు ఇంటిని జప్తు చేస్తున్నట్టు నోటీసు పెట్టారు. తర్వాత బ్యాంక్ లోన్ మొత్తం డబ్బును చెల్లించాను. దాంతో జీవితంలో మళ్లీ లోన్ తీసుకోకూడదని అనుకున్నా అని గుర్తుచేశారు. అందుకే గోడపై నోటీసు తొలగించలేదని చెప్పారు. సినిమా చేసేప్పుడు హిట్, ప్లాప్ అని ఏ ఆశ పెట్టుకోనని తేజ చెప్పారు. తన కుమారుడిని హీరోగా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నానని వివరంచారు తేజ (Teja).