NLG: ప్రజానాట్య మండలి చిట్యాల మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ తెలిపారు. అధ్యక్షుడిగా మేడి లింగస్వామి, కార్యదర్శిలుగా జిట్ట స్వామి, ఉపాధ్యక్షుడిగా పేర్వారం రాములు, వీరమళ్ళ మణెమ్మ, నవీన్ కుమార్, సహా కార్యదర్శిలుగా నాగిళ్ళ కిరణ్, పెరిక సరిత, మేడి రాంబాబు, కోశాధికారిగా గుండె పరమేష్ ఎన్నికయ్యారు.