పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో భారత్, బంగ్లాకు చెందిన ఇద్దరు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని, మరణించినవారిలో భారత వ్యక్తి లేరని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ఇది ఊరటనిచ్చే విషయమంటూ సౌదీలోని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది.