AP: CM చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లా డోన్ మండలంలో పర్యటించనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు వెళ్తున్న ఆయన.. ఈ మేరకు స్థానిక కొత్తబురుజు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంటారు. ఈ క్రమంలో మ.2 గంటలకు పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం TDP కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సా.4.20 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్తారు.